HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. నాంపల్లి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు మంజూరు చేసింది. దాంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే…. దేశం విడిచి వెళ్లొద్దంటూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఏసీబీ విచారణకు సహకరించాలని తెలిపింది..షరతులతో కూడిన బెయిల్ HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు మంజూరు చేసింది. శివ బాలకృష్ణతోపాటు అతని సోదరుడు శివ నవీన్ కూడా విడుదల అయ్యారు.


