21.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు …. సోనియాకు ఆహ్వానం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రేవంత్ రెడ్డి సర్కారు. ఇందులో భాగంగా రాష్ట్రం ఇచ్చిన  కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఈ వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. అయితే.. ఇదంతా భాగానే ఉన్నా.. తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇవ్వలేదని కొట్లాడి తెచ్చుకున్నామని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది బీఆర్ఎస్. మరి.. ఆవిర్భావ దినోత్సవ వేళ గులాబీ పార్టీ అధినేత ఏం చేయబోతున్నారు ? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఎందరో తెలంగాణ ఉద్యమకారుల ఎదురుచూపులు ఫలించిన రోజు.. మాకంటూ ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటూ నెత్తురు చిందించిన త్యాగమూర్తుల త్యాగాలకు ఫలితం దక్కిన రోజు.. జూన్ 2, 2014. త్వరలోనే తెలంగాణ రాష్ర్టం ఏర్పాటై పదేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించాలని ఇప్పటికే సీఎం నేతృత్వంలో ఇటీవలె జరిగిన కేబినెట్ సమావేశంలోనూ నిర్ణయం తీసుకున్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రజల దశాబ్దాల నాటి కల నెరవేర్చింది నాటి యూపీఏ ప్రభుత్వమేనని.. ప్రత్యేకించి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చొరవ కారణంగానే రాష్ట్రం ఏర్పాటైందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించారు హస్తం పార్టీ నేతలు. అంతేకాదు.. ఓ పండువలా జరిపే ఈ ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అందరికీ గుర్తుండి పోయేలాగా నిర్వహించబోతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, మేధావులను, ఉద్యమంతోపాటు రాష్ట్ర ఏర్పాటు కోసం క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని అందరినీ ఆహ్వానించనుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించే వేడుకలు కావడంతో సహజంగానే ప్రజా ప్రతినిధులకు ప్రముఖంగా ఆహ్వానాలు పంపనుంది. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం అందనుంది. అయితే.. ఇతరుల సంగతి ఏమో కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈ వేడుకలకు వస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

వాస్తవానికి యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దీంతో రాష్ట్రం ఇచ్చిన ఘనత మాదేనని ప్రకటించు కుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రత్యేక రాష్ట్రం ఆషామాషీగా రాలేదని, కొట్లాడి తెచ్చుకున్నామని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావునోట్లోకి వెళ్లి మరీ తెలంగాణ రాష్ట్రం సాధించారని గులాబీ పార్టీ నేతలు చెబుతుంటారు. ఈ విషయాన్నే ప్రజల్లోకి సైతం గట్టిగా తీసుకెళ్లారు. దీంతో యూపీఏ ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినా, తెలంగాణలో మాత్రం తొలి ప్రభుత్వాన్ని గులాబీ పార్టీ ఏర్పాటు చేసింది. 2014లో కారు పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం తో కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారు. హస్తం పార్టీని తీవ్రంగా దెబ్బతీశారు. దీంతో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తాన్ని వీడి కారెక్కేశారు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లారు నాటి సీఎం కేసీఆర్. వరుసగా రెండోసారి సైతం ప్రజలు గులాబీ అధినేతకు పట్టం కట్టారు. దీంతో.. ఎన్నికలు ఏదైనా, సందర్భం ఏదైనా తెలంగాణ తెచ్చింది కేసీఆరే అన్న ప్రచారాన్ని మరింతగా హోరెత్తించింది గులాబీ పార్టీ.

ఈ క్రమంలోనే కొందరు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ జాతిపితగా కేసీఆర్‌ను అభివర్ణిస్తుంటారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లోనే గతేడాది వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు గులాబీ పార్టీని ఘోరంగా దెబ్బకొట్టాయి. దీంతో పదేళ్ల తర్వాత.. ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అధికారాన్ని చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యారు. దీంతో ఇప్పుడు తమ వాయిస్‌ను బలంగా విన్పించడం మొదలు పెట్టారు హస్తం నేతలు. తెలంగాణ ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదేనన్న వాదనను ఇప్పుడు మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తీసుకొచ్చామన్న బీఆర్ఎస్ ఏం చేయబోతోంది అన్నది ఆసక్తి రేపుతోంది. కారు పార్టీ నేతలు, శ్రేణుల ద్వారా విన్పిస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గులాబీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావడం అనుమానమే అన్న వాదన విన్పిస్తోంది.

మరోవైపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే, రానున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఏడాది పాటూ ఘనంగా నిర్వహించాలని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ఏం చేయాలన్న దానిపై త్వరలోనే పార్టీ నేతలతో సమాలోచనలు చేయనున్నారు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్. ప్రస్తుతానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి పెట్టడంతో అది పూర్తైన తర్వాత పార్టీ నేతలతో సమావేశం కానున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఆ తర్వాతే గులాబీ పార్టీ ఏం చేస్తుందన్న దానిపై ఓ క్లారిటీ రానుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్