నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని..కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భోజనం తిన్న తర్వాత ఆరువ తరగతి విద్యార్థులు యాథావిధిగా క్లాసులకు హాజరయ్యారు. సాయంత్రం వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురికావడంతో 15 మంది విద్యార్థు లను మండల ఆసుపత్రికి తరలించారు. మరో ఐదుగురిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు..విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తమకు ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.