స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వ అధికారులు కౌన్సిల్ సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. సమావేశం ప్రారంభమైన కాసేపటికే గందరగోళం నెలకొంది. విపక్ష కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మి చైర్ వద్దకు వెళ్లి నిరసన చేపట్టారు. మేయర్ వారించినప్పటికీ వెనక్కి తగ్గకపోవడంతో సభలో రసాభాస ఏర్పడింది. విపక్ష కార్పొరేటర్ల తీరుకు నిరసనగా వాటర్ బోర్డు అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగిస్తూ మేయర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ సమావేశాలను విపక్ష కార్పొరేటర్లు బాయ్ కాట్ చేశారు కానీ.. తొలిసారిగా జీహెచ్ఎంసీ చరిత్రలోనే అధికారులు సమావేశాన్ని బాయ్ కాట్ చేయడం చర్చనీయాంశమైంది.