స్వతంత్ర వెబ్ డెస్క్: సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవన్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా సెట్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గతంలో వర్షం కారణంగా సెట్ కూలిపోవడంతో.. దానికి మరమ్మత్తులు చేసే క్రమంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్రిష్ దర్శకత్వంలో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారని తెలుస్తోంది.