స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘గ్లాడియేటర్2’ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు సిబ్బంది గాయపడినట్లు చిత్రబృందం తెలిపింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ సెట్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన యూనిట్ సభ్యులు గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రధాన తారగణానికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే సెట్ అంతా మంటల్లో కాలిపోవడం వల్ల షూటింగ్ ఆలస్యం కానుంది మూవీ యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. కాగా 2000 సంవత్సరంలో వచ్చిన ‘గ్లాడియేటర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం ఎంతో మంది అభిమానులు వేచి చూస్తున్నారు.