ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తాళ్లూరు మండలం నెక్కల్లు శివారులో రాజధాని నిర్మాణం కోసం డంప్ చేసిన పైపులకు మంటలు అంటుకున్నాయి. మురుగు నీటి కాలువల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున పైపులు గత నాలుగు సంవత్సరాలుగా అక్కడే ఉండిపోవడంతో వాటిలో తేనెటీగలు తుట్టెలు పెట్టాయి. తేనె కోసం వచ్చిన కొందరు పొగబెట్టే ప్రయత్నం చేస్తుండగా మంటలు పైపులకు వ్యాపించాయి. వేడిగాలులకు క్షణాల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అక్కడ నిల్వచేసిన పైపులన్ని అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు.