బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. హేమకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి ఆమెను విడుదల చేశారు. కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను బెంగుళూరు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు. ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ క్రమంలో తాజాగా హేమకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె జైలు నుంచి విడుదల చేశారు.


