స్వతంత్ర వెబ్ డెస్క్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరు జిల్లా మేల్పట్టంపాక్కం వద్ద ప్రైవేటు బస్సులు ఢీ కొట్టుకోవడంతో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 70మంది గాయపడగా.. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో బస్సులు నుజ్జునుజ్జయాయ్యి. కడలూరు సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి తిరువణ్ణామలై వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు నెల్లికుప్పం సమీపంలో ఉండగా.. అప్పుడే పన్రుటి నుంచి వస్తున్న దుర్గ అనే ప్రైవేట్ బస్సు టైరు పగిలిపోవడంతో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు ప్రైవేట్ బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిప్‌మార్ ఆస్పత్రికి, పూడూరులోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గా వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు కడలూరు జిల్లా కలెక్టర్ అరుణ్ తంబురాజ్, పోలీసు సూపరింటెండెంట్ రాజారామన్ తదితరులు కడలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్న క్షతగాత్రులను పరామర్శించారు.
ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఫోన్ ద్వారా కడలూరు జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, వారి బంధువులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఆసుపత్రికి, స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్న వారికి ఒక్కొక్కరికి రూ.25,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.