CM KCR Speech in Maharashtra | త్వరలో దేశంలో రైతు తుఫాన్ రాబోతోందని.. దాన్నెవరూ ఆపలేరని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు. రైతులకు ప్రతి ఎకరాకు 10 వేలు ఇచ్చే వరకు కొట్లాడతామన్నారు. మన కళ్లముందే నీరు సముద్రంలో కలిసిపోతున్నా.. తాగునీరుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎంతమంది పాలకులు మారినా ప్రజల తలరాతలు మారడం లేదని అన్నారు. 125 ఏళ్లపాటు విద్యుత్ ఇచ్చేంత బొగ్గు మన దగ్గర ఉన్నా.. ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోతున్నారు? అంటూ కేంద్ర బీజేపీని నిలదీశారు.
మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. సరిహద్దు ప్రాంతాలలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించడమే లక్ష్యంగా మహారాష్ట్రలోని కందార్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో ప్రజలు ముందుకు సాగాలన్నారు. త్వరలో మహారాష్ట్రలో జరిగే జిల్లా పరిషత్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని సీఎం ప్రకటించారు.