రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీడాక్టర్(Family Doctor) విధానాన్ని ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి(CM Jagan) తెలియజేశారు. దేశంలో గొప్ప మార్పునకు లింగంగుంట్ల నుంచి శ్రీకారం చుట్టామని అన్నారు. గురువారం చికలూరిపేటలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. దేశచరిత్రలోనే వైద్యసేవల విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టామని.. ఈ విధానం దేశ చరిత్రలోనే ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షించారు.
ఇప్పటివరకు వైద్యం కోసం ఇబ్బంది పడ్డ ప్రజలు.. ఇకనుండి డాక్టర్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఆస్పత్రులు, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదని.. అందుకోసమే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చామన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌తో వ్యాధులు ముదరకముందే గుర్తించి అరికట్టవచ్చని తెలిపారు. గ్రామ క్లినీక్‌లో సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు ఉంటారని అన్నారు. ప్రతీ 2వేల జనాభాకు ఓ క్లినిక్ ఉంటుందని తెలిపారు.
మరోవైపు ప్రతిపక్షాలను చెడుగుడు ఆడించారు సీఎం జగన్(CM Jagan). స్కామ్‌లే తప్ప.. స్కీమ్‌లు తెలియని బాబులు అంటూ చిలకలూరిపేట సభలో ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీ మాత్రమే వారికి తెలుసని వ్యాఖ్యానించారు. లంచావతారాలు.. గజ దొంగలు.. వయసు పెరిగినా బుద్ధి పెరగని క్రిమినల్ మంచావతారాలు.. సామాజిక అన్యాయం తప్ప న్యాయం తెలియని పరాన్న జీవులు అంటూ చెలరేగిపోయాడు. మీ బిడ్డను ఎదుర్కోలేకనే పలానా మంచి పని చేశామని చెప్పుకోలేకనే ప్రతిపక్షాలు జిత్తులు, ఎత్తులు, పొత్తులతో కుయుక్తులు పన్నుతున్నాయని ప్రజలకు చెప్పారు. మీబిడ్డ పొత్తులతో ఆధారపడనని… ఎవరితోనైనా పొత్తు అంటే.. అది మీతోనే అంటూ ప్రజలకు సీఎం తెలియజెప్పారు.
Read Also: కరోనా కల్లోలం… ఒకే స్కూల్లో 15 మంది విద్యార్థులకు కరోనా
Follow us on: Youtube, Instagram, Google News