28.8 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

ఎగ్జిట్ పోల్స్ ప్రస్థానం

   ఎగ్జిట్ పోల్స్ సంస్కృతి మొదట నెదర్లాండ్స్‌లో ప్రారంభమైంది. మనదేశంలో 1957లో తొలిసారి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిం చారు. సహజంగా ఎగ్జిట్‌ పోల్స్‌కు సక్సెస్ రేటు ఎక్కువ. శాంపిల్స్‌ను విశ్లేషించే పద్ధతి, సర్వే సాధనాలను అమలు చేసే తీరు ఎగ్జిట్‌ పోల్స్ సక్సెస్ రేటుకు ప్రధాన కారణమవుతుంది. ఎగ్జిట్ పోల్ అనేది ఒక రకమైన ఎన్నికల సర్వే. పోలింగ్ జరిగిన రోజున ఓటర్ల ప్రతిస్పందన ఆధారంగా ఎగ్జిట్ పోల్‌ ను తయారు చేస్తారు. సహజంగా పోలింగ్ ముగిసిన తరు వాత వివిధ సంస్థలు అనేక మార్గాల్లో సర్వేలు నిర్వహిస్తుంటాయి. పోలింగ్ స్టేషన్ల పరిసరాల్లో ఓటర్లను ప్రశ్నించి, సమాధానాలను విశ్లేషించి, ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో అంచనా వేస్తారు. ఈ సర్వేలో కేవలం ఓటర్లను మాత్రమే భాగస్వామ్యం చేస్తారు

   ఎగ్జిట్ పోల్ అనేది ఒక రకమైన ఎన్నికల సర్వే. పోలింగ్ జరిగిన రోజున ఓటర్ల ప్రతిస్పందన ఆధారంగా ఎగ్జిట్ పోల్‌ ను తయారు చేస్తారు. సహజంగా పోలింగ్ ముగిసిన తరువాత వివిధ సంస్థలు అనేక మార్గాల్లో సర్వేలు నిర్వహిస్తుంటాయి. పోలింగ్ స్టేషన్ల పరిసరాల్లో ఓటర్లను ప్రశ్నించి, సమాధానాలను విశ్లేషించి, ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో అంచనా వేస్తారు. ఈ సర్వేలో కేవలం ఓటర్లను మాత్రమే భాగస్వామ్యం చేస్తారు. సాధ్యమైనంతవరకు అంతిమ ఫలితాలకు ఎగ్జిట్ పోల్ దగ్గరగా ఉండేలా సకల జాగ్రత్తలు సేకరిస్తారు. సహజంగా రాష్ట్రం లేదా దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది ? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ? నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల గెలుపోటములు ఎలా ఉంటాయి ? ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది ? ఇలాంటి లెక్కలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఆయా సర్వే సంస్థలు నివేదికలు విడుదల చేస్తుంటాయి. ఎగ్జిట్ పోల్స్ విడుదలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 ప్రకారం అన్ని దశల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాల్సి ఉంటుంది.

   గడువు కంటే ముందుగానే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడాన్ని ప్రజా ప్రాతినిథ్య చట్టం నిషేధించింది. అలా ఎవరైనా లేదా ఏ సర్వే సంస్థ అయినా విడుదల చేస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అందుకు జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండేళ్ల పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. అంతేకాదు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. మనదేశంలో ఎగ్జిట్‌ పోల్స్ సర్వేను తొలిసారిగా 1957లో నిర్వహించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేకోసం ఇరవై వేల నుంచి ముప్పయి వేల మంది వరకు ఓటర్లను అడిగి సమాధానాలు రాబట్టారు. అలాగే 1996 లోక్‌సభ ఎన్నికల్లో కూడా సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అనే సంస్థ పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. దీని కోసం 17,604 మంది ఓటర్ల నాడి తెలుసుకున్నారు. అంటే శాంపిల్స్ ఇరవై వేలకు లోపే. అయినప్పటికీ, ఫలితాలను సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సంస్థ కచ్చితంగా అంచనా వేయగలిగింది. సహజంగా ఇప్పటివరకు మెజా రిటీ ఎగ్జిట్‌ పోల్స్ విజయవంతమయ్యాయి. దీనికి అనేక కారణాలున్నాయి. శాంపిల్స్ సంఖ్య ఇందులో ఒక ముఖ్య కారణం. అలాగే శాంపిల్స్‌ను విశ్లేషించే పద్ధతి, సర్వే సాధనాలను అమలు చేసే తీరు కూడా సక్సెస్ రేటుకు కారణమవుతుంది. శాంపిల్స్ ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే, విశ్లేషణ అంత కచ్చితంగా ఉంటుందన్నది ఒక నమ్మకం. అంతిమంగా సర్వే ఫలితాలు అసలు ఫలితాలకు దగ్గరగా ఉంటాయం టారు నిపుణులు.

   ఓసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 285 సీట్లు వస్తాయని అనేక సంస్థలు అంచనా వేశాయి. అయితే ఎన్టీయే కూటమి అనూహ్యంగా 353 సీట్లు కైవసం చేసుకుంది. ఒక్క భారతీయ జనతా పార్టీనే స్వంతంగా 303 నియోజకవర్గాలు గెలుచుకుంది. అంతకుముందు 2014లో ఎన్డీయే కూటమికి 257 నుంచి 340 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. కాగా ఎన్డీయే కూటమికి 336 సీట్లు వచ్చాయి అంతిమ ఫలితాల్లో. ఎగ్జిట్ పోల్స్ కొన్నిసార్లు తప్పయ్యాయి. దీనికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్‌ అయ్యాయి. అప్పట్లో ఇండియా షైనింగ్ పేరుతో వచ్చిన ప్రచారం ఉధృతంగా సాగింది. ఈ ప్రచార ఉధృతిని చూసి భారతీయ జనతా పార్టీ ప్రభంజనం వస్తుందని అందరూ జోస్యాలు చెప్పారు. అయితే తుది ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి.

   వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ సంస్కృతి మొదట నెదర్లాండ్స్‌లో ప్రారంభమైంది. నెదర్గాండ్స్ సామాజికవేత్త మార్సెల్ వాన్ డామ్ ఎగ్జిట్ పోల్స్ సంస్కృతికి పునాది వేశారు. సహజంగా ఎగ్జిట్ పోల్స్ , ఒపీనియన్  పోల్స్ ఒకటే అని అందరూ భావిస్తారు. అయితే ఈ రెండూ వేర్వేరు. ఒపీనియన్ పోల్ కూడా ఒకరకంగా ఎన్నికల సర్వేనే. అయితే దీనిని ఎన్నిక లకు ముందు విడుదల చేస్తారు. ఈ సర్వేలో అన్ని వర్గాలను అనేకానేక అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. సమాధానాలు అన్నిటినీ విశ్లేషించిన తరువాతే ఒపీనియన్ పోల్‌ను విడుదల చేస్తారు. అయితే పోలింగ్ ముగిసిన తరువాత ఒకే రోజు శాంపిల్స్ ఆధారంగా సర్వే నిర్వహించి విడుదల చేసేది ఎగ్జిట్ పోల్స్. పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తరువాత ఓటర్లు ఇచ్చే సమాధానాలను బట్టి ఏ పార్టీకి ఎక్కువ మంది ఓటేశారు అనే వివరాలు నమోదు చేస్తారు. ఈ వివరాల ఆధారంగా ఎగ్జిట్  పోల్స్‌ను విడుదల చేస్తారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్