మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీవైపీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో స్థిరాస్తుల వివరాలను పేర్కొనకుండా గోప్యంగా ఉంచినందుకు ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని రామచంద్రయాదవ్ కోరారు. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్యకు సంబంధించిన 142 స్థిరాస్తులను పేర్కొనలేదనడంతో.. ఆ వాదనను ధ్రువీకరిస్తూ ఆ ఆస్తుల వివరాలతో అఫిడవిట్ వేయాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది. అలాగే పోలింగ్‌లో పెద్దిరెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు పొందిన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డి పేరును పిటిషన్‌లో ప్రతివాదుల జాబితాలో చేర్చాలని పిటిషనర్‌కు సూచించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 31కి హైకోర్టు వాయిదా వేసింది.