బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను 10 నుంచి12 సీట్లలో గెలిపిస్తే 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థితికి వస్తారని అన్నారు. మోదీ సెస్సుల రూపంలో కొత్త పన్నులు వసూలు చేశారని మండిపడ్డారు. పేదల రక్తం పీల్చి పదేళ్లలో రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో పదేళ్లలో రూ.30 లక్షల కోట్లు వసూళ్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పింది తప్పని బీజేపీ నేతలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.


