స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలో అధికారులు రహదారి విస్తరణ చేపట్టారు. విస్తరణలో భాగంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించాలని నిర్ణయించారు. అయితే అధికారుల నిర్ణయంపై చిన్నారెడ్డి మండిపడ్డారు. విగ్రహం తొలగించాలని చూస్తే తుపాకీతో కాల్చేస్తాని వార్నింగ్ ఇచ్చారు. విస్తరణ పేరు చెప్పి కూడళ్లలో జాతీయ నాయకుల విగ్రహాలను తొలగింపు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రోడ్డు విస్తరణ సందర్భంగా పాతబజార్‌లోని దర్గా, ఓ ఆలయ స్వాగత తోరణం తొలగించినందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేతలు ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చచెప్పడంతో ఇరు వర్గాలు వెనక్కి తగ్గాయి.