స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్రలో మంగళవారం రాత్రి ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి గాయాలయ్యాయి. దీంతో నంద్యాల పోలీసులు అఖిలప్రియపై హత్యాయత్నం కేసు నమోదుచేశారు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి నంద్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.