ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. పాఠశాలల హాస్టల్ బిల్డింగ్‌లకు అద్దె చెల్లించే డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తున్నా విమర్శించడం సరికాదన్నారు. గ్రామ పంచాయతీ, పట్టణాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే అది కేవలం కేంద్రం నిధులతోనే అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహించారు. వాటిపై ఒక్క మంత్రి మాట్లాడడంలేదని, ముఖం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతకుముందు ఈటల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ప్రజల ఇచ్చిన రిప్రజెంటేషన్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.