26.7 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదుల హతం

స్వతంత్ర వెబ్ డెస్క్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో  భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పూంచ్‌ జిల్లాలోని సింధారా  ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి ఇండియన్‌ ఆర్మీ ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్‌ సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, టెర్రరిస్టులకు మధ్య పెద్దఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి.

భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారని అధికారులు తెలిపారు. వారంతా విదేశీ ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్‌, మ్యాగజైన్‌, 11 రౌండ్ల బుల్లెట్లు, ఇతర మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్