స్వతంత్ర వెబ్ డెస్క్: కేసీఆర్(KCR) పాలనలో వ్యవసాయం(Agriculture) దండుగ అనే పరిస్థితి ఏర్పడిందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. వరి వేయవద్దని కేసీఆర్ ప్రభుత్వమే చెబుతోందన్నారు. రైతులకు వ్యవసాయ సబ్సిడీలు(Agricultural Subsidies), వ్యవసాయ రుణాలు పావలా వడ్డీకి ఇవ్వట్లేదన్నారు. ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా రైతు రుణాలు మాఫీ చేస్తున్నారని విమర్శించారు. కల్తీ సీడ్ బౌల్‌గా తెలంగాణ మారే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తొమ్మదేళ్లుగా కేసీఆర్ సర్కారు పంటల బీమా పథకం అమలు చేయట్లేదన్నారు. రైతుల ఆత్మహత్యల్లో 75శాతం మంది కౌలురైతులే ఉన్నారని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. భాజపాకు అధికారమిస్తే రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం గడ్డ నుంచి రైతులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. రజాకార్ల సమయంలో హిందువులను ఎలా ఊచకోత కోశారో మనకు తెలుసన్న కిషన్‌రెడ్డి .. కాంగ్రెస్, భారాస రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. భారాసకు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్టేనని.. భారాస, కాంగ్రెస్ దేనికి ఓటేసినా మజ్లిస్‌కు ఓటేసినట్టేనని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.