స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: గ్రూప్-4 అభ్యర్ధులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు ఈనెల 9 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే ఈ గడువు ముగిసిన అనంతరం మరోసారి తప్పుల సవరణకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8,180 గ్రూప్4 ఉద్యోగాలకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జులై 1న ఈ పరీక్ష జరగనుంది. ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలని అభ్యర్థులు ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నారు. మరోవైపు పీఈసెట్ దరఖాస్తుల గడువును కూడా పొడిగిస్తూ TSPSC నిర్ణయం తీసుకుంది. ఎటువంటి ఫైన్ లేకుండా ఈనెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.