తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఈసీ. పోలింగ్ సమయాన్ని పెంచాలని ఎలక్షన్ కమిషన్ కు అన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్.
తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచినట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. సాధారణంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు నిన్నటి వరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దేశంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నాయి. దీంతో పలు రాష్ట్రాల నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు పోలింగ్ సమయాన్ని పెంచాలం టూ విజ్ఞప్తులు వచ్చాయి. ఐదు గంటల నుంచి 6 గంటల వరకు మరో గంట పాటు పెంచాలని, పలు రాష్ట్రాల రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు రావడంతో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పెంచింది ఈసీ.అయితే తెలంగాణలో కూడా అన్ని రాజకీయ పార్టీలు సీఈవో వికాస్ రాజుకు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు విజ్ఞప్తులు చేశాయి. రాష్ట్రంలో సైతం ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలు ఉంటుంది. ఎండల సమయంలో ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం మూడు, నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని వాతావ రణ శాఖ కూడా హెచ్చరించింది. సాధారణంగా ఎన్నికల పోలింగ్‌ను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే నిర్వహిస్తారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ఎన్నికల సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే..మరొక గంట పాటు అదనంగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తులతో పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత విషయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కి నివేదిక రూపంలో వికాస్ రాజ్ అందజేశారు.
సీఈవో వికాస్ రాజ్, అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తులతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయాన్ని ఒక గంటపాటు పొడిగిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. మావోయిస్టు, సమస్యాత్మక ప్రాంతాలలో మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంద న్నారు. మిగతా అన్ని కాన్సెన్సీలలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించినట్లు అధికారిక ప్రకటించారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఉన్నటు వంటి ఐదు లోక్ సభ స్థానాలు, 13 అసెంబ్లీల పరిధిలో సాయంత్రం 4గంటలకు వరకు పోలింగ్ నిర్వహిం చనున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో సిర్పూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ, పెద్ద పల్లి లోక్‌సభ పరిధిలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు వివరిం చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ప్రత్యేకమైన కూబింగ్, బార్డర్ ప్రాంతాల్లో మూడంచెల నిఘా అదే విధంగా సెంట్రల్ ఫోర్సెస్ ఇలా అన్ని రకాల పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుం టున్నామ న్నారు.


