స్వతంత్ర వెబ్ డెస్క్: మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఈ భూకంపం ఉఖ్రుల్‌లో మధ్యాహ్నం 12.14 గంటలకు సంభవించింది. ఉఖ్రుల్‌కు 13 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. దీని కేంద్రం 70 కి.మీ లోతులో ఉంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంపం గురించి తెలిసిన వెంటనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రకంపనలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు ముందు కూడా మణిపూర్‌లో భూకంపం సంభవించింది. మే నెలలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 3.2. షిరుయికి వాయువ్యంగా మూడు కిలోమీటర్ల దూరంలో సంభవించింది.
ఇక మరోవైపు మణిపూర్‌లో పరిస్థితులు ఇంకా సద్దుమణగ లేదు. రెండు జాతుల మధ్య మే 2న ప్రారంభమైన రావణకాష్టం ఇంకా కాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మణిపూర్‌లో పరిస్థితులు జమ్ము కశ్మీర్, పంజాబ్ కంటే దారుణంగా ఉన్నాయి.