స్వతంత్ర వెబ్ డెస్క్: ఇప్పటికే ఆర్ధిక మాంద్యంతో అల్లాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాలు కారణంగా ఇప్పయివరకు 34మంది చనిపోగా.. 150 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 8మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఎంతో మంది ప్రజలు తుపాను కారణంగా తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరోవైపు భారీ వర్షాలతో ఇంటి పైకప్పు కూలిపోవడంతో 12మంది అక్కడే శిథిలాల కింద సమాధి అయ్యారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని 4 జిల్లాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రతినిధి తైమూర్ అలీ ఖాన్ తెలిపారు. బన్నూ జిల్లాలో 15 మంది మృతి చెందగా వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు. వారి వయస్సు 2 నుండి 11 సంవత్సరాల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో సుమారు 140 మంది తీవ్రంగా గాయపడ్డారు. 200 కంటే ఎక్కువ జంతువులు మరణించాయి. ఈ నాలుగు జిల్లాల్లో అధికార యంత్రాంగం ఎమర్జెన్సీ ప్రకటించింది. అన్ని చోట్లా రెస్క్యూ టీమ్‌లను మోహరించారు.