రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు డీఎస్సీ నోటిఫికేషన్ ఎంతగానో తోడ్పడుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయడంపై గుంటూరు లాడ్జి సెంటర్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి కొనసాగు తోందని ఆమె అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడం ఎంతో సంతోషమ న్నారు గల్లా మాధవి. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని గుంటూరు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర అన్నారు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయడం ఎంతో హర్షించదగిన విషయమన్నారు. కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు.


