విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని సీపీ రవి శంకర్ చెప్పారు. సీబీఐ అధికారుల వినతితోనే డాగ్ స్క్వాడ్ అక్కడికి వెళ్లిందని చెప్పారు. దర్యాప్తును ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారనేది అవాస్తవమన్నారు. సీబీఐ అధికారులు రిక్వెస్ట్ చేయడంతోనే స్థానిక అధికారులు అక్కడికి వెళ్లారని చెప్పారు. పట్టుబడ్డ ప్రైవేటు పోర్టు తమ పరిధిలో లేదని అన్నారు సీపీ రవిశంకర్
విశాఖలో భారీగా పట్టుబడిన డ్రగ్స్ ఘటన ఏపీనే కాకుండా దేశాన్నే కుదిపేసిందని బీజేపీ నాయకురాలు సాధినేని యామినీశర్మ అన్నారు. రాష్ట్రంలో పోలీసులు, నార్కోటిక్స్ విభాగం డ్రగ్స్ సరఫరాను అరికట్టకుండా నిద్రపోతున్నారా అని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని.. మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. వీటి వల్లే మహిళలపై నేరాలు, దాడులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని సాధినేని చెప్పారు.