హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సైబరాబాద్ పరిధిలో పోలీసుల దాడిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దీనికి సంబంధించి సినీ రంగానికి చెందిన ప్రముఖ హీరోయిన్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే విధంగా మరో ఐదుగురు నైజీరియన్లు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన ఐదుగురు ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేశారు.