Mohan Babu | ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వంలో విడుదలైన చిత్రం “బలగం(Balagam)”. తెలంగాణ యాస, గోసతో విడుదలైన ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలిస్తుంది. ఎంతో మందితో మన్ననలు అందుకున్న ఈ చిత్ర దర్శకుడు వేణుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. అలగే ఈ చిత్రం మరిన్ని అవార్డ్స్ లు సొంతం చేసుకుంది. తాజాగా, డాక్టర్ ఎం మోహన్ బాబు(Mohan Babu), విష్ణు మంచు(Manchu Vishnu) బలగం చిత్రాన్ని వీక్షించి అద్భుతంగా ఉంది అని కొనియాడారు. అనంతరం వారిని ఇంటికి పిలిపించి చిత్రంలో నటించిన నటీ నటులను, దర్శకుడు వేణుని హృదయపూర్వకంగా అభినందించి సత్కరించారు.
Read Also: రూ.లక్ష కోట్లకు చేరిన కేసీఆర్ కుటుంబం ఆస్తి: రేవంత్ రెడ్డి
Follow us on: Youtube, Instagram, Google News