నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఇంటింటికి బ్రహ్మన్న కార్యక్రమాన్ని ప్రారం భించారు. చంద్ర బాబుని ముఖ్యమంత్రిని చేయడానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి బ్రహ్మన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి వస్తుందో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.


