దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం కూడా నష్టపోయాయి. ఈరోజు ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సరికి నష్టాలబాటలో పడ్డాయి. ఉదయం సెన్సెక్స్ 61,932.32 దగ్గర నష్టాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 61,340.10 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 371.83 పాయింట్ల నష్టంతో 61,560.64 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 18,300.45 దగ్గర మొదలై ఇంట్రాడేలో 18,115.35 దగ్గర కనిష్ఠానికి చేరింది. చివరకు 104.75 పాయింట్లు నష్టపోయి 18,181.75 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు నష్టపోయి 82.38 దగ్గర నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ షేర్లు లాభాల బాటలో పయనించగా… కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, విప్రో, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టైటన్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.