స్వతంత్ర వెబ్ డెస్క్: గతంలో బీజేపీలోకి వెళ్లిన తీన్మార్ మల్లన్న రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. మరోవైపు సొంత పార్టీని స్థాపించి తన టీమ్ సభ్యులను కూడా ఎన్నికల బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయనకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున ఆయన పోటీ చేయనున్నారని సమాచారం. అంతేకాదు ఆ పార్టీ తరపున ఆయనే సీఎం అభ్యర్థి అని చెపుతున్నారు. మేడ్చల్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.