పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది బీజేపీ దూకుడు పెంచింది. దక్షణాదిలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ పార్టీలు సైతం తమ పట్టును నిలబెట్టుకునేం దుకు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకుంటున్నాయి. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే… కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలను కూడా కలుపుకుపోయే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలోని మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బీజేపీ పుంజుకుంటుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తుండటంతో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతిస్తున్నట్లు కమలహాసన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడంలేదని చెప్పిన కమల్ హాసన్ దేశం కోసం డీఎంకే, కాంగ్రెస్‌తో జట్టు కట్టినట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ దక్షణాది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన బీజేపీతో జట్టుకడితే… కాంగ్రెస్‌తో జట్టుకున్నాయి కొత్తపార్టీలు.


