ద్రవిడ వాదానికి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రసంగ పాఠంలో కొన్నిపేరాల్ని దాటించేసిన గవర్నర్ రవి
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీలదే అక్కడ హవా. తాజాగా డీఎంకే ప్రభుత్వం తనదైన శైలిలో దూసుకొని వెళుతోంది. ఈ క్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవికి, స్టాలిన్ ప్రభుత్వానికి ఏ మాత్రం పొసగటం లేదు.
తమిళనాడు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమయంలో ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగాన్ని గవర్నర్ చదవటం ఆనవాయితీ. గవర్నరుగా ప్రసంగాన్ని మొదలు పెట్టిన రవి.. కొన్ని పేరాల్ని దాటించేసి ముందుకు వెళ్లారు. దీనికి అభ్యంతరం చెప్పిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అసెంబ్లీ రికార్డుల్లోకి తమ ప్రసంగపాఠమే వెళ్లాలని డిమాండ్ చేశారు. ద్రవిడ వాదానికి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు ఉండటంతో వాటిని దాటించేసినట్లు గవర్నర్ వర్గం చెబుతోంది. ఈ లోగా గడబిడ చెలరేగటంతో గవర్నర్ రవి…అక్కడ నుంచి వెళ్లిపోయారు.
మొత్తంగా చూస్తే..అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేయటం విన్నాం, చూశాం కానీ, గవర్నర్ వాకౌట్ చేయటం మాత్రం విడ్డూరంగా నిలిచింది.