స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఉదయ్ కిరణ్ తెలుగు హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే హిట్ సినిమాలు చేసి తనకంటూ యువతలో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. అయితే కొద్దికాలం పాటు ఉదయ్ సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో అతను మానసికంగా కుంగిపోయి 2014లో ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. కానీ ఇప్పటికీ చాలా మందికి ఉదయ్ మరణం పట్ల చాలా అనుమానాలున్నాయి. తాజాగా దీనిపై స్టార్ డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉదయ్ డెత్ మిస్టరీ గురించి చాలా మందికి తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘అహింస’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి తేజను ప్రశ్నించారు. దీంతో ‘దాని గురించి మాట్లాడతాను. అయితే ‘కొందరు ‘మీరే చెప్పండి’ అంటూ అమాయకంగా యాక్ట్ చేస్తుంటారు’ అని సమాధానమిచ్చారు.
కాగా ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో కారణం తనకు తెలుసని తేజ గతేడాది కూడా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్‌ను మొదట వెండితెరకు పరిచయం చేసిందే తేజనే. ‘చిత్రం’ మూవీతో హీరోగా ఇంట్రెడ్యూస్ చేయగా.. అనంతరం ‘నువ్వు నేను’, ‘ఔనన్నా కాదన్నా’ సినిమాలు కూడా తీశాడు. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.