ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభిస్తోంది. అతిసార కారణంగా వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో ఇప్పటికే ఇద్దరు మరణించారు. మరో 35 మంది తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్క జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఇప్పటికే 50కి పైగా ఓపీ డయేరియా లక్షణాలు ఉన్న రోగులు ఉండగా ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు.
డయేరియా వ్యాప్తి నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జగ్గయ్యపేటలో పర్యటించారు. ప్రభుత్వా స్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జగ్గయ్యపేటలో మొత్తం 8 గ్రామాల్లో డయేరియా కేసులు విస్తరిస్తున్నాయని మంత్రి సత్య కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు అధికారికంగా 58 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. డయేరియా కట్టడిపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నామని చెప్పారు. నీటి సమస్య కారణంగా డయేరి యా విస్తరిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని అన్నారు. కాబట్టి ప్రజలు అవగాహనతో ఉండా లని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు.డయేరియా విజృంభిస్తున్న నేపథ్యం లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వాస్పత్రిలో 40 బెడ్లతో ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, జేసీలు జగ్గయ్యపేటలోనే మకాం వేసి పరిస్థితిని ఎప్పటిక ప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా, జగ్గయ్యపేటలో రెండ్రోజుల పాటు చికెన్, మటన్, చేపల అమ్మకంపై నిషేధం విధించారు.