పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ నేత నవనీత్‌కౌర్, ఎంఐఎం నేత అసదుద్దీన్ మధ్య మాటల తూటాలు పేలుతు న్నాయి. గతంలో 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే సత్తా చూపిస్తామని అక్బురుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తమకు 15 సెకన్ల సమయం చాలని నవనీత్‌కౌర్ అన్నారు. మీకు 15 నిమిషాలు పట్టచ్చేమో, కానీ మాకు 15 సెకన్లు మాత్రమే పడుతుందని అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా నవనీత్ కౌర్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. 15 సెకన్లు మాత్రమే ఎందుకు15 గంటల సమయం తీసుకోవాలని అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. వారు ముస్లింలను ఏమి చేయాలనుకుంటే ఏమి చేయాలన్నారు. అధికారమంతా మీ దగ్గరే ఉందని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని మాటలెందుకు అనుకున్నది చేసి చూపించాలన్నారు.


