స్వతంత్ర వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఐదు టైటిల్స్ గెలిచిన రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. కెప్టెన్ కూల్ ధోని నాయకత్వంలో చెన్నై చిరస్మరణీయ విజయంతో కప్‌ను సొంతం చేసుకుంది. ఇంకా ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని భావించిన అభిమానులకి మహి గుడ్ న్యూస్ చెప్పాడు.
నా రిటైర్‌మెంట్‌పై సమాధానం కోసం మీరు చూస్తున్నారా..? దానిపై ప్రకటన చేయడానికి ఇది సరైన సమయమే. కానీ, ఈ ఏడాది నేను ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకుల నుంచి భారీగా ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నా. ఇలాంటప్పుడు అందరికీ థాంక్స్ అని చెప్పడం చాలా సులువు. అయితే, నాకు కష్టమైన విషయం ఏంటంటే.. మరో 9 నెలలు శ్రమించి కనీసం వచ్చే సీజన్ అయినా ఆడాలి. ఇదంతా నా శరీరంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది. టైటిల్‌ను మా జట్టు నాకు గిఫ్ట్ ఇచ్చింది. నాపట్ల వారు చూపిన ప్రేమాభిమానాలకు.. నేను చేయాల్సిన బాధ్యతలు ఇంకా ఉన్నాయనిపిస్తోంది అంటూ తాను మరో సీజన్ ఆడనున్నట్లు చెప్పకనే చెప్పాడు ధోని.