23.2 C
Hyderabad
Sunday, December 22, 2024
spot_img

రూ. 11 వేల కోట్లతో తెలంగాణ అభివృద్ధి: ప్రధాని మోదీ

PM Modi Tour | భారీ భద్రత నడుమ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సాగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కి చేరుకున్న ప్రధానికి  బీజేపీ నేతలు స్వాగతం పలికారు. సభలో పాల్గొని అక్కడకి  చేరుకున్న ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టారు. ప్రియమైన సోదర, సోదరీమణులారా అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ.. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ రైలు ప్రారంభించామని అన్నారు. భాగ్యలక్ష్మి నగరాన్ని శ్రీ వెంకటేశ్వరస్వామి నగరంతో కలిపామని అన్నారు. రూ. 11 వేల కోట్లతో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

సభా వేదిక పైనుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు మోడీ ప్రారంభించారు. దీనితో పాటుగా జాతీయ రహదారుల నిర్మాణానికి, రాష్ట్రంలో రూ.7,864 కోట్లతో కొత్తగా 6 జాతీయ రహదారుల విస్తరణకు… రూ.1366 కోట్లతో బీబీనగర్‌ ఎయిమ్స్‌ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ(PM Modi) శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్‌- సికింద్రాబాద్ డబ్లింగ్‌ లైన్​ను జాతికి అంకితం చేశారు. అనంతరం సికింద్రాబాద్- మేడ్చల్‌ మధ్య ఎంఎంటీఎస్‌ రెండో దశ సేవలను ప్రారంభించారు.

ప్రధాని మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం రాలేదని అన్నారు. అభివృద్ధి పనుల్లో కేంద్రంతో రాష్ట్రప్రభుత్వం కలిసి రావట్లేదని అన్నారు. కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదని అన్నారు. కేంద్రం అభివృద్ధి పనులు చేపడుతుంటే రాష్ట్రప్రభుత్వం బాధపడుతోందని అన్నారు. ‘దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా? అవినీతిపరులపై పోరాటం చేయాలా వద్దా? అవినీతిపరుల విషయంలో చట్టం తనపని తాను చేసుకోవాలా? వద్దా? కుటుంబ పాలన నుంచి ఈ ప్రజలకు విముక్తి కల్పిస్తాం’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

Read Also: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Follow us on:  Youtube, Instagram, Google News

 

 

 

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్