లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే మెదక్ అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌ను నమ్మితే నట్టేట మునగడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, భ్రమలో ఓట్లు వేశారని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన అక్రమాల చిట్టా విప్పుతామన్నారు. మల్లన్న సాగర్ కుంభకోణంలో బినామీల పేర్లతో పాసుబుక్‌లు సృష్టించి హరీష్‌రావు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపిం చారు. మెదక్‌లో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వధిస్తున్నారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి, మెదక్ కంటోన్మెంట్లలో బంపర్ మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.


