ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం క్షీణించింది. నిన్న తిహార్ జైలు అధికారులు కవితను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ వివిధ వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. కవిత ఆరోగ్యం క్షీణించడం పట్ల భర్త అనిల్ భావోద్వేగానికి గురయ్యారు.
కవిత తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. మెరుగైన వైద్య చికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు న్యాయస్థానాన్ని కోరారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల అబ్లిగేషన్‌ను నిరాకరించిన న్యాయస్థానం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చింది.
భర్త అనిల్ సమక్షంలో కవితకు ఎయిమ్స్ వైద్య బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ వైద్య పరీక్షల సమయంలో కవిత పది కిలోల బరువు తగ్గినట్లు తెలిసింది. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరి యా టెస్టులు చేశారు. జైలులో దోమలు అధికంగా ఉండటం వల్ల కొందరు డెంగ్యూ జ్వర బాధితులు ఉన్నారని కవిత తరపు న్యాయవాదులు చెబుతున్నారు.