రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు వైసీపీ అధినేత జగన్.. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదని విమర్శించారు.. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.వైసీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారంటూ ట్వీట్టర్ వేదికగా జగన్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో హత్యలు, అత్యాచారాలు పెరిగాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రం దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అన్నారు.రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు…. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు కోరారు.