ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. కవిత సహా ఇతర నిందితులపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై జడ్జి కావేరి భవేజా విచారణ జరపనున్నారు. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో జూన్ 7న సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్‌ను జూలై 22న రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇవాళ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఇతర నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే ఈడీ అరెస్టు చేసింది. కవిత తిహార్ జైలులో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది. ఆ తర్వాత కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును కవిత హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు సైతం ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తోంది.