స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేసులో చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరిగే మ్యాచులో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ లో స్థానం సంపాదించుకోవచ్చు. ఓడితే మాత్రం మిగిలిన రెండు మ్యాచుల్లో ఒకటి తప్పకుండా గెలవాలి. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలవాలంటే కోల్‌కతా హార్డ్ హిట్టర్లు జేసన్ రాయ్, గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, ఆండ్రూ రసెల్, రింకూ సింగ్‌ల దూకుడుకు ఆరంభంలోనే అడ్డుకట్ట వేయాలి. హోం గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో మ్యాచ్ జరగడం చెన్నైకు కలిసివచ్చే అవకాశం ఉంది.
జట్లు అంచనా….
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే, అజింక్య రహానె, శివమ్ దూబె, మొయిన్ అలీ, జడేజా, ధోనీ (C/WK), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ, మతీషా పతిరణ
కోల్‌కతా: జేసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (WK), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా(C), రసెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, సుయాశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్