నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ మొక్కులు తీర్చుకునేందుకు భారీగా భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. భక్తులు తెల్లవారుజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూ కట్టారు. భక్తులు శ్రీస్వామి అమ్మవార్లకు రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


