హైదరాబాద్: ప్రగతిభవన్ లో జరిగిన BRS విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్(CM KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 నుంచి 15 మంది MLAలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వారి వల్లే పార్టీకి చెడ్డపేరు వస్తోందన్నారు. ఇప్పటికైనా పద్ధతిగా మారండి.. లేదంటే మిమ్మల్ని మార్చాల్సి వస్తోందని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా సమావేశంలోని నేతలంతా షాక్ కు గురయ్యారు. ఆ అవినీతి నేతలు ఎవరా అని ఆరా తీసే పనిలో పడ్డారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేసీఆర్ నేతల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టారని బీఆర్ఎస్(BRS) వర్గాలు చెబుతున్నాయి. సొంత పార్టీ నేతలపైనే అవినీతి ఆరోపణలు ఉన్నాయని కేసీఆర్(KCR) ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.