Covid cases in India | భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12వేల 591 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 65వేల 286 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. దీంతో పలు రాష్ట్రాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా మళ్ళీ పెరిగే అవకాశం ఉన్నందుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జనంలో గుమిగూడి ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ని ధరించాలని కోరారు. ఎప్పటికప్పుడు రెండుచేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.