Corona Cases in India |దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా విస్తరిస్తుంది. తాజాగా ఒక్కరోజులోనే 1000కి పైగా కొత్త కేసులు నమోదుకావడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇలా వెయ్యికి పైకాకేసులు నమోదుకావడం 129 రోజుల తరువాత ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశం మొత్తం మీద 5,915 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 1,071 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయని పేర్కొంది. తాజాగా రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో మృతుల సంఖ్య 5,30,802కు చేరింది. ఝార్ఖండ్‌లో రెండు హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా, అయిదు కరోనా కేసులు నమోదయినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.