దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు బూస్టర్ డోస్ అందించనుంది. ఇందుకోసం 5లక్షల కార్బో వ్యాక్సిన్ డోసులను అందుబాటులో ఉంచింది. అర్హులైన వారు బూస్టర్ డోస్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మొదటి, రెండు డోసుల్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లలో ఏది తీసుకున్నా.. బూస్టర్ డోస్ గా కార్బో వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. కాగా రాష్ట్రాలే స్వయంగా కరోనా వ్యాక్సిన్ లు కొనుగోలు చేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో బయోలాజికల్ సంస్థ నుంచి కార్బో వ్యాక్సిన్ డోసులను ప్రభుత్వం కొనుగోలు చేసింది.