స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. కనకపురా నుంచి బరిలోకి దిగిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ . 70 శాతానికి పైగా ఓట్లతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి అశోక్, జేడీఎస్ నేత బి.నాగరాజులు తదుపరి స్థానాలకు పరిమితమయ్యారు. కనకపురా నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి డీకే శివకుమార్ గెలవటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 12 స్థానాల్లో జయకేతనం మోగించింది. బీజేపీ మూడు, జేడీఎస్‌లు ఒక్క స్థానంలో గెలుపొందాయి. మొత్తంగా కాంగ్రెస్ 110, బీజేపీ 65, జేడీఎస్ 25, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యం కనబర్చారు. కాంగ్రెస్ గెలుపుతో కర్ణాటకలో ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి. దిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.