30.2 C
Hyderabad
Friday, February 20, 2026
spot_img

తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయనున్న కాంగ్రెస్

   తెలంగాణకు ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. గాంధీభవన్ లో మేని ఫెస్టోను ఆవిష్కరించనున్నారు. రాహుల్ నామినేషన్ కి కార్యక్రమంలో పాల్గొ నేందుకు సీఎం రేవంత్‌ యూపీకి వెళ్లిన తెలంగాణ మేనిఫెస్టోను రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ దీపా దాస్ మున్షీ విడుదల చేస్తారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏమేం చేస్తామ నేవి ఈ మేనిఫెస్టోలో వెల్లడిస్తారు.

    రాష్ట్ర విభజన హామీల అమలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ తదితర అంశాలకు ఇందులో చోటు దక్క నుందని తెలుస్తోంది. జాతీయ కాంగ్రెస్ ఇప్పటికే న్యాయ్ పత్ర్ పేరుతో మేని ఫెస్టోను విడుదల చేసింది. అయితే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం చేస్తామనే వివరాలతో మేనిఫెస్టోను విడుదల చేయనుంది.లోక్ సభ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో పార్టీలు హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ మేనిఫెస్టోలో ప్రకటించనుది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తెచ్చే పథకాలు అమలు చేయనున్న పథకాలకు సంబం ధించి ప్రత్యేకంగా మేనిఫెస్టోను ప్రకటించేందుకు సిద్ధమైంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి ఇతర అగ్రనేతలు ఇవాళ గాంధీభవన్లో నిర్వహించే సమావేశంలో ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేయనున్నారు. ఈ ప్రత్యేక మేనిఫెస్టోలో తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలను పొందు పరిచినట్టు తెలుస్తోంది.

   ఏపీ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరేవేర్చేలా ఎన్నికల ప్రణాళికలో పొందు పర్చినట్లు తెలుస్తోంది.ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ నగరాల్లో కొత్త విమానా శ్రయాలు ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని, తెలంగాణాలో డ్రై పోర్టును ఏర్పాటు చేస్తామన్న భరోసాను ఎన్నికల ప్రణాళికలో చేర్చినట్టు సమాచారం. పాలమూరు-రంగా రెడ్డి ఎత్తిపోతల పథకా నికి జాతీయ హోదా వచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామన్న హామీని ఇవ్వనున్నట్టు సమాచారం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్