తెలంగాణలో బ్రూ ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలన అంటేనే కుంభకోణాలని అన్నారు. ధాన్యం సేకరణ, బియ్యం కొనుగోళ్లలో భారీ స్కామ్ జరిగిందని చెప్పారు. సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌లో జరిగిన స్కామ్‌పై సీఎం, మంత్రి నోరు విప్పడం లేదన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. రూ.2 లక్షలు రుణమాఫి చేస్తా మని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసే తెలివి లేదన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1100 కోట్ల కుంభకోణం చేసిందని ఆరోపించారు.